యాక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతోఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇదిలావుండగా నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు తార స్థాయికి చేరాయి. తాజాగా తన తండ్రి మోహన్ బాబు తనపై, తన భార్యపై దాడి చేశారని గాయాలతో పీఎస్ కు వచ్చి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. స్కూల్, ఆస్తుల వ్యవహారంపై ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తండ్రి మోహన్ బాబుపై మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ కూడా తనపై దాడి చేశారని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆస్తులు, స్కూల్ అంశాలపై వీరిమధ్య విభేదాలున్నాయి. మోహన్ బాబు- మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులతో టాలీవుడ్ లో కలకలం రేగింది.ఇదిలావుండగా గత కొన్ని రోజుల నుండి మంచు ఫ్యామిలీ గురించి ఎలాంటి వార్తలు వినిపించలేదు. అయితే కొన్ని రోజుల క్రితం మాత్రం మంచు ఫ్యామిలీ లో గొడవలు రోజు హెడ్ లైన్స్ లో నిలచేవి. మంచు మనోజ్ తన తండ్రి, సోదరుడుతో విభేదాలు పెంచుకొని దూరంగా ఉంటున్నాడని ఫిల్మినగర్ టాక్. ముఖ్యంగా మనోజ్ రెండో వివాహం తరువాత ఈ వివాదాలు ముదిరి పాకన పడినట్టే కనిపించింది. అయితే విష్ణు, మనోజ్ ఒకే తల్లి బిడ్డలు కాకపోవడం కూడా వివాదాలకు ఓ కారణమని మంచు కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారి చెప్పే మాట.ఈ విషయం ఇలా ఉండగా గతంలో కూడా మంచు విష్ణు... మనోజ్ ఇంటికెళ్లి గొడవ పడినట్లు పలు వీడియోలు బయటికొచ్చాయి. ఈ వీడియోలలో మనోజ్ మాట్లాడుతూ తనకి కావాల్సిన వ్యక్తులపై విష్ణు తన అనుచరులతో వచ్చి దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: