ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు ఎంత ట్రెండ్ అవుతున్నాయో మనం బాగా గమనిస్తూనే వస్తున్నాం. నిజానికి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి అని కొన్ని నెలల ముందే అందరికీ బాగా తెలుసు . మరీ ముఖ్యంగా భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడు మంచు మనోజ్  అని తెలియగానే చాలామంది షాక్ అయిపోయారు . అసలు మోహన్ బాబుకి ఆ ఫ్యామిలీ అంటేనే పడదు మరి ఎలా చేసుకుంటున్నాడు ..? అంటూ అంత చర్చించుకున్నారు మాట్లాడుకున్నారు .


ఫైనల్లీ మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు ఈ జంట . అయితే మంచు మనోజ్ కి మంచు మోహన్ బాబుకి మంచు విష్ణుకి గొడవలు జరుగుతున్నాయి అంటూ అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. దానికి తగ్గట్టే వీళ్ళు కూడా ప్రవర్తిస్తూవచ్చారు. కాగా రీసెంట్ గా ఇప్పుడు మంచు మోహన్ బాబు మంచు మనోజ్ పై దాడి చేశాడు  అని..ఆ కారణంగానే  మంచు మనోజ్ గాయాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు అన్న వార్త సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది .



తండ్రిపై ఈ విధంగా కొడుకు కేసు పెట్టడం సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. అసలు ఇంత జరగడానికి కారణం తెలుగు టాప్ సీనియర్ స్టార్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేసింది ఆ టాప్ హీరోనే అని.. ఫ్యామిలీలో గొడవలు జరుగుతాయి అని తెలిసినా కూడా మంచు మనోజ్ కి సపోర్ట్ చేస్తూ ఇంత రాద్ధాంతం జరిగే విధంగా సృష్టించాడు అని ..ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కొట్టుకుంటూ ఉంటే ఈ హీరో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి గొడవలు జరుగుతూ ఉండడం అందరికీ బాధాకరంగా మారింది. మరి కొందరు మాత్రం అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ వాళ్ళు చూసుకుంటారు మధ్యలో మీకెందుకు..? అంటూ చాలా ఘాటుగా రిప్లై ఇస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: