సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ చాలా చాలా ఓపెన్ గా తమ అభిప్రాయాలని చెప్పేస్తున్నారు . మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలలో టు ఓపెన్ గా స్పందించేస్తున్నారు. రీసెంట్గా పుష్ప2 విషయంలో కూడా అలాగే చేశారు బన్నీ అభిమానులు. మరీ ముఖ్యంగా బన్నీ సినిమా పుష్ప2 సినిమా ఏ రేంజ్ లో ఇండస్ట్రీని షేక్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఏకంగా రెండు రోజుల్లోనే 500 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసింది . ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి కారణం సుకుమార్ - బన్నీ - రష్మిక అంటున్నారు జనాలు.


సుకుమార్ డైరెక్షన్ బాగో లేకపోయినా .. సుకుమార్ చెప్పినట్లు బన్నీ - రష్మిక నటించక పోయిన.. రష్మిక - బన్నీకి అంత ఫ్రీడమ్ ఇవ్వకపోయినా .. సినిమాలో సీన్స్ హైలెట్గా పండేవి కావు అంటూ చెబుతున్నారు. కొందరు బన్నీ కాకుండా ఈ సినిమాలో ఏ హీరో అయితే బాగుండేది అంటే ఎన్టీఆర్ పేరు సజెస్ట్ చేస్తున్నారు . మరికొందరు రష్మిక కాకుండా శ్రీ వల్లి పాత్రలో ఏ హీరోయిన్ అయితే  బాగుండేది అంటూ చర్చించుకుంటున్నారు . అయితే చాలామంది సమంత - నయనతారల పేర్లు చెప్పుకుంటున్నారు .



అందలా ముద్దుగుమ్మ సమంతా గాని అదేవిధంగా నయనతార కానీ ఈ పాత్రలో ఇంకా బాగా సెట్ అయి ఉండేవారు అని ..రష్మిక కూడా చాలా బాగా నటించింది అని ..రష్మిక కన్నా కూడా ఈ సినిమాలో సమంత అయితే ఓ రేంజ్ లో  కుమ్మేసి ఉండేది అని పొగిడేస్తున్నారు . మొత్తానికి రష్మిక మందన్నా తన కెరియర్ లో ఎన్నో హిట్స్ అందుకున్న కూడా నటనాపరంగా హిట్టు అందుకున్న ఫస్ట్ సినిమా పుష్ప2 నే అంటూ అందరు మాట్లాడుకుంటూ ఉండటం గమనార్హం. కాగా పుష్ప 3 కూడా ఉంటుంది అని ఫైనల్ లో ఓ హింట్ ఇచ్చాడు సుకుమార్. ఆ సినిమాలో అయిన సమంతని యాడ్ చేస్తే బాగుంటుంది అంటూ మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: