ఈ సందర్భంగా హైదరాబాద్ లో చిత్ర బృందం విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.... ఏపీ ముఖ్యమంత్రి పవన్ ను కళ్యాణ్ బాబాయ్ అని సంబోధిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో టాపిక్ అవుతోంది. గత ఎన్నికల సమయంలో మెగా కుటుంబం అందరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపును కోరుతూ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఆ కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ మాత్రం నంద్యాలలో వైసిపి అభ్యర్థి రవి గెలుపుకు ప్రచారం చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
దీంతో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య వివాదాలు నెలకొన్నాయి. కాగా, ఏపీలో టికెట్ల ధరలు పెంచినందుకు తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కు కళ్యాణ్ బాబాయ్ అని అల్లు అర్జున్ థాంక్స్ చెప్పాడు. దీంతో పవన్ కళ్యాణ్ ఎప్పుడు అల్లు అర్జున్ కు బాబాయ్ అయ్యారు అని అంటున్నారు. ఆయన వరుసకు మామయ్య అవుతాడు కదా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో సందేహం నెలకొంటుంది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా బన్నీకి మేనత్త భర్త అంటే మామయ్య అవుతాడు. ఆయన తమ్ముడిగా పవన్ కళ్యాణ్ కూడా మామయ్యే అవుతాడు కదా.
మరి గతంలో ఎన్నడూ పవర్ స్టార్ ను ఉద్దేశించి కల్యాణ్ బాబాయ్ అని బన్నీ ప్రస్తావించిన సందర్భాలు లేవు. కానీ మెగా కాంపౌండ్ కు చెందిన హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్ లాంటివారు థాంక్స్ చెప్పే పద్ధతిని ఇమిటేట్ చేస్తూ కళ్యాణ్ బాబాయ్ థాంక్యూ వెరీ మచ్ అన్నారా అని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.