శ్రీలీల గురించి ఎంత చెప్పినా తప్పే అవుతుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ బ్యూటీ హవానే కొనసాగుతోంది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది ఆ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ చిన్నది సక్సెస్ఫుల్ హీరోయిన్గా దూసుకుపోతోంది. తన నటన, అందం, డాన్స్ చూసిన దర్శక నిర్మాతలు శ్రీ లీల డేట్స్ కోసం క్యూలో నిలబడుతున్నారు. సీనియర్, జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా అగ్ర హీరోలు అందరి సరసన నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. 

సినీ ఇండస్ట్రీలో ఈ చిన్న దానికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. కాగా, శ్రీ లీల తాజాగా నటించిన పుష్ప2 సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో శ్రీ లీల స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకుల చూపును తన వైపు తిప్పుకుంది. ఈ పాటలో శ్రీ లీల డ్యాన్స్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా.... శ్రీ లీల ప్రస్తుతం హీరో నితిన్ తో కలిసి రాబిన్ హుడ్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. 

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో చిత్ర యూనిట్ అంతా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ వీడియో తీశారు. అందులో హీరో నితిన్ తన రూమ్ లో కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. రూమ్ బయట హీరో అని బోర్డు పైన రాసి ఉంది. అలా హీరో అని రాసి ఉన్న గదికి శ్రీ లీల కావాలనే హీరోయిన్ అనే పేరు రాసి లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్లి నితిన్ ని చూసి ఏంటి హీరోయిన్ రూమ్ లో మీరు ఉన్నారు అని అంటుంది.


అప్పుడు నితిన్ కాదు ఇది హీరో రూమ్ అని అంటే బయటకు వచ్చి చూడండి అని శ్రీ లీల చెబుతుంది. అప్పటికే శ్రీ లీల చేతిలో ఉన్న మార్కర్ చూసిన నితిన్ బయట బోర్డుపై శ్రీ లీల రాసిన పేరు చెరిపేసి లోపలికి వెళ్తాడు. అప్పుడు శ్రీ లీల అయ్యో ప్రాంక్ పోయింది అంటూ సరదాగా నవ్వుతుంది. ఈ వీడియోను శ్రీ లీల సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: