ఈ క్రమంలోని ఆయన సంతకం చేసిన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ , OG వంటి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ మధ్యకాలంలో ఐటమ్ సాంగ్స్ కి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసింది. ఇటీవల పాన్ ఇండియా మూవీ గా విడుదలైన పుష్ప సినిమాలో సమంత తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. అలాగే తాజాగా విడుదలైన పుష్ప 2 సినిమాలో శ్రీ లీలా కూడా ఐటమ్ సాంగ్ చేసి మెప్పించింది.
అయితే ఇప్పుడు వీరిద్దరినీ కాదని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం అనసూయను రంగంలోకి దింపినట్లు సమాచారం. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను గతంలోనే షూటింగ్ చేశారట. అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ ఎం ఎం కీరవాణి కంపోజ్ చేసిన ఒక మాస్ డాన్స్ నంబర్ దీనికోసమేనని ఇప్పుడు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కాస్త పెదవి విరుస్తున్నట్లు సమాచారం. పెద్దపెద్ద స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తుంటే.. ఒక యాంకర్ ను తీసుకొచ్చి ఐటమ్ సాంగ్ చేయమంటే ఎలా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై చిత్ర బృందం ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.