ఏంటి అక్కినేని నాగార్జున చేసిన పాపాలు కొడుకులకు చుట్టుకున్నాయా.. ఇంతకీ ఆ డైరెక్టర్ అన్నమాట ఏంటి..ఆ డైరెక్టర్ ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. రీసెంట్ గా నాగార్జున ఫ్యామిలీలోకి కొత్త కోడలుగా శోభిత అడుగు పెట్టింది.అలాగే చిన్న కొడుకుకి కూడా పెళ్లి చేస్తున్నామని ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోస్ షేర్ చేసుకొని తమ ఫ్యామిలీలోకి ఇద్దరు కొత్తకోడళ్ళు రాబోతున్నట్టు చెప్పారు. రీసెంట్ గానే పెద్ద కొడుకు పెళ్లి జరిగింది.అయితే ఈ ఏడాదిలో నాగార్జునకు రెండు గుడ్ న్యూస్ లు రెండు బ్యాడ్ న్యూస్ లు ఎదురయ్యాయి. అదేంటంటే.. ఒకటి హైడ్రా పేరుతో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చేయడం. 

మరొకటి తెలంగాణ మహిళా మంత్రి నాగార్జున మాజీ కోడలు సమంతను ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయకుండా ఉండడం కోసం కేటీఆర్ రూమ్ కి వెళ్ళమని నాగార్జున అన్నారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.ఈ రెండు నాగ్ కి ఎదురైన చేదు అనుభవాలు.అయితే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూలిపోవడం గురించి డైరెక్టర్ గీతాకృష్ణ మాట్లాడుతూ.. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూలిపోతే ఎవరు కూడా సింపతి చూపించలేదు. ఎందుకంటే ఈయనకు లేడీస్ మాన్ అనే ట్యాగ్ ఉంది. అంతేకాదు ఈయన ఆ అమ్మాయికి అది ఇచ్చాడు ఈ అమ్మాయికి ఇది ఇచ్చాడు అని ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి.

 అంతేకాదు ఎప్పుడైతే రామానాయుడు కూతురికి విడాకులు ఇచ్చారో అప్పటి నుండి నాగార్జున పై నెగిటివిటీ పెరిగిపోయింది. ఇక ఈయన చేసిన పనులు కొడుకులకి పాపాలుగా చుట్టుకుంటున్నాయి. ఇక తండ్రిలాగే ఇద్దరు కొడుకులకు కూడా మొదటి పెళ్లి కలిసి రాలేదు.పెద్ద కొడుకు పెళ్లి చేసుకోని నాలుగు సంవత్సరాలు కాపురం చేశాక భార్యకు విడాకులు ఇస్తే చిన్నకొడుకు గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత పలు కారణాల వల్ల దాన్ని రద్దు చేసుకున్నాడు. రీసెంట్ గానే మరో అమ్మాయిని పెళ్లాడానికి రెడీ అయ్యాడు. అయితే ఇవన్నీ నాగార్జున చేసిన తప్పులకు కారణం అంటూ అర్థం వచ్చేలా డైరెక్టర్ గీత కృష్ణ నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి అక్కినేని ఫ్యాన్స్ గీతాకృష్ణ మాటలపై ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: