ఏపీలో మాత్రం చాలా ఏరియాలలో టికెట్ రేట్లకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. సాధారణంగా ఎంత పెద్ద సినిమాకు అయినా మండే రోజున డ్రాప్స్ ఉండటం జరుగుతుంది. పుష్ప2 సినిమాకు కూడా ఈ డ్రాప్స్ ఒకింత ఎక్కువగానే ఉండనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప ది రూల్ టికెట్ రేట్లలో ఉన్న ట్విస్టులు నెటిజన్లకు ఆశ్చర్యాన్ని గురి చేస్తుండటం గమనార్హం.
పుష్ప ది రూల్ మూడు రోజుల్లో 600 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుందని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ నెక్స్ట్ లెవెల్ కథాంశంతో తెరకెక్కగా పుష్ప ది ర్యాంపేజ్ సినిమాపై సైతం అంచనాలు పెరుగుతున్నాయి. పుష్ప ది ర్యాంపేజ్ సినిమా బడ్జెట్ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అని సమాచారం అందుతోంది.
పుష్ప ది రూల్ కలెక్షన్లు ఇండస్ట్రీ వర్గాలను సైతం షాక్ కు గురి చేస్తున్నాయి. ఈ సినిమా సులువుగా 1500 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయి. మలయాళం మినహా మిగతా అన్ని వెర్షన్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఈ సినిమాకు 800 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు రావడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.