టాలీవుడ్ లోనే కాదు బయట కూడా నటసింహం బాలకృష్ణ తోనే కాదు .. నందమూరి కుటుంబంతో కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కాస్త గ్యాప్ వచ్చిందని ఫ్యాన్స్ చాలా కాలంగా అనుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే చాలా రూమర్లు కూడా ఉన్నాయి .. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సభ్యులతో కలుస్తూనే ఉన్నాడు .. ఇక జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ చాలా సందర్భాల్లో అభినందించారు. అయితే తొలిసారి ఎన్టీఆర్  ని బాలయ్య మెచ్చుకున్న సందర్భం ఒకటి ఉంది.  ఇక ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు .. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో  మొదటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు ..


అలాగే వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్ సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా కాలేజ్ , రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ఎంతో పవర్ఫుల్ నటనతో అదర్ కొట్టాడు.అయితే బెల్లంకొండ సురేష్ ఆది సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేయాలనుకున్నారు .. అది కూడా వివి వినాయక్‌ దర్శకత్వంలోనే ఆ సినిమానే చెన్నకేశవరెడ్డి. వినాయక్‌ని బాలయ్య దగ్గరికి పంపించి కథ చెప్పమని బెల్లంకొండ సురేష్ చెప్పారు. అప్పటికి బాలయ్యకి వినాయక్‌ ఆది దర్శకుడు అని తెలియదు . కథ‌ విన్న తర్వాత ఇతనే ఆది డైరెక్టర్ అని చెప్పారు. ఇక ఆది సూపర్ హిట్ అని బాలయ్యకు తెలుసు .. కాని ఆ సినిమాని అప్పటికి ఆయన చూడలేదు..  ఇతనే ఆది సినిమా దర్శకుడని చెప్పగానే.. ముందే చెప్పాలి కదా అని అన్నారు ..


ఆది మూవీ నాకు స్పెషల్ షో వేయండి అని బాలయ్య స్వయంగా అడిగారు.. ఆ సమయంలో ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రత్యేక షో బాలయ్య కోసం వెయ్యగా ఆయన అక్కడ సినిమా చూశారు.. తర్వాత వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కి బాలయ్య ఫోన్ చెయ్యండి అని అడిగారు.. వెంటనే అక్కడే ఎన్టీఆర్ తో మాట్లాడి ఆయన అభినందించారు.. ఆ సమయంలో ఎన్టీఆర్ అల్లరి రాముడు షూటింగ్లో ఉన్నారు.. రేయ్ బాగ చేశావ్ రా.. బ్రహ్మాండంగా ఉంది. టాప్ పెర్ఫార్మెన్స్.. కంగ్రాట్స్ అని  బాలయ్య అభినందించారు.  బాలకృష్ణ అంటేనే కల్మషం లేని మనిషి అంటూ బెల్లంకొండ సురేష్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .. ఆయనకి ఆ టైంలో మనసులో అనిపించింది చెప్పేస్తారు.. ఎది ఆయన మనసులో దాచుకోరు. కోపం అయినా ప్రేమైనా.. చెన్నకేశవరెడ్డి సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: