- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్‌ సినిమాను.. ఉత్తరాది ప్రేక్షకులకు పూర్తిగా ఓన్ చేసుకున్నారు. ఎంతగా అంటే.. మొదటి రోజు ఓపెనింగ్ ఏకంగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ రికార్డు ని బద్దలు కొట్టేంతగా ఓన్ చేసుకున్నారు. మామూలుగా డబ్బింగ్ సినిమాలుకు ఆదరణ తక్కువగా ఉండే రాష్ట్రాలలోనూ .. ఈ పాన్ ఇండియా సినిమా క్రియేట్ చేస్తున్న బీభత్సం అంతా ఇంత కాదు. ఇది చూసి బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల సంతోషానికి పట్టపగలు లేకుండా పోయాయి.


ఒక నాన్‌ ప్రభాస్ .. అందులోనూ రాజమౌళి దర్శకత్వం వహించని ఒక కమర్షియల్ బొమ్మ .. ఈ స్థాయిలో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భీభ‌త్స‌వం చేయడం బహుశా ఇదే మొదటిసారి. దీనిని బ‌ట్టి నార్త్ వాళ్లు ఇంతగా పుష్పరాజ్‌ను తమ గుండెల్లో పెట్టుకోడానికి దోహదం చేసిన ఐదు కారణాలు ఏంటో చూద్దాం.
1 ) గత కొన్నేళ్ళుగా బాలీవుడ్ ఎక్కువగా అర్బన్ ఆడియన్స్ - ఓటీల‌ను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తున్నారు. మాస్‌ను మెప్పించే అంశాలు వాళ్లకు లేవు. అందుకే దెయ్యాలకు భ్రహ్మ‌ర‌థం పట్టాల్సిన పరిస్థితి.
2 ) రెండో కారణం జ‌పాన్ ఫైట్ .. ర‌ష్మిక తో సీన్లు.. ర‌ష్మిక పాత్ర‌
3 ) మూడో కారణం నేటివిటీ.. చిత్తూరు గ్రామ దేవత గంగమ్మ జాతరని అందరికీ కనెక్ట్ అయ్యేలా సుకుమార్ఎపిసోడ్ తరికేక్కించిన తీరు అదిరిపోయింది.


4 ) నాలుగవ‌ కారణం దేవిశ్రీప్రసాద్ పాటలు. అలాగే దేవిశ్రీ , శ్యామ్ సిఎస్ కలిపి అందించిన నేపథ్య సంగీతం కూడా.
5 ) ఐదో కారణం అల్లు అర్జున్ జాతర , క్లైమాక్స్ , పోలీస్ స్టేషన్ ఈ మూడింటిని ఇదే స్థాయిలో ఇంకే హీరో ఎవరైనా.. పెర్ఫామ్ చేస్తే ఇంత బాగా సెట్ అయ్యేది కాదేమో. ఏది ఏమైనా.. నార్త్ జనాలు పుష్పని ఒక రేంజ్ లో నెత్తిన పెట్టుకొని సూపర్ హిట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: