- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

ఒకప్పుడు సీక్వెల్ వస్తుంది అంటే ప్రేక్షకుల గుండె గుబేల్ మనేది. పార్ట్ 2 తీయటానికి మేకర్స్ బిక్కు బిక్కుమంటూ ఉండేవారు. రక్త చరిత్ర పార్ట్ 2 తీస్తే చుక్కలు కనిపించాయి. కథానాయకుడు మూవీ సీక్వెల్ అస్సలు పట్టించుకోలేదు. సీక్వెల్ అంటే బెంబేలు ఎత్తిపోయే రోజుల నుంచి .. పార్ట్ 2 ఉంటేనే ముద్దు అనే స్థితికి టాలీవుడ్ వచ్చేసింది. ఇప్పుడు పార్ట్ 2 తీయకపోతే .. అదో పెద్ద వార్త. ఈ యేడాది సీక్వెల్స్ పంట పండింది. ఒకటి కాదు , రెండు కాదు , ఏకంగా మూడు సీక్వెల్స్ సూపర్ హిట్ అయ్యాయి. పుష్ప‌ పార్ట్ 2 ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. మొదటి రోజే పుష్ప ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 294 కోట్ల గ్రాస్ సాధించింది.


సూపర్ హిట్ డిజే టిల్లు సీక్వెల్ ఎంత పెద్ద హిట్ అయిందో ? తెలిసిందే. ఇప్పుడు పార్ట్ - 3 కూడా ఉందంటున్నారు. అలాగే .. మరో సీక్వెల్ మత్తు వదలరా 2 కూడా ఈ ఏడాది సైలెంట్ గా వచ్చి పెద్ద హిట్ అయింది. క్రైమ్ , కామెడీ , జనరల్‌లో వచ్చిన ఈ సినిమా .. ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాల్లో పెద్ద హిట్ కొట్టింది. అలా 2024 సంవత్సరం సీక్వెల్స్ కు బాగా కలిసి వచ్చింది. అలా అని.. అన్ని సీక్వెల్స్ హిట్ అవలేదు. డబ్బుల్‌ ఇస్మార్ట్ డిజాస్టర్. యాత్ర 2 డిజాస్టర్. గీతాంజలి మళ్లీ వచ్చింది డిజాస్టర్. రాబోయే రోజుల్లో దేవర 2 , కల్కి 2 , పుష్ప 3 లాంటి పెద్ద పెద్ద సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి. ఈ సీక్వెల్స్ సినిమా పై ఏ స్థాయి లో అంచ‌నాలు ఉన్నాయో చెప్ప‌క్క‌ర్లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: