టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంట్లో తాజాగా ఆస్తి వివాదాలు నెలకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈరోజు ఉదయం నుంచి మోహన్ బాబు కుటుంబం గురించి పలు రకాల వార్తలయితే వినిపిస్తూ ఉన్నాయి.. ముఖ్యంగా మోహన్ బాబు, ఆయన కుమారుడు మనోజ్ మధ్య గొడవ జరిగిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి ..ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మనోజ్ తీవ్రగాయాలతో పోలీస్ స్టేషన్కు వెళ్లి మరి తన తండ్రి మీద కంప్లైంట్ ఇచ్చినట్లుగా సమాచారం.



అయితే ఈ విషయం పైన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ స్పందించి అవన్నీ రూమర్స్ అంటూ ఎలాంటి నిజం లేదంటూ తెలియజేసింది. కానీ ఇప్పుడు తాజాగా మనోజ్ బంజారాహిల్స్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలోకి చేరినట్టు సమాచారం.. అందుకు గల కారణం ఏమిటంటే తన కాలికి గాయం అవ్వడంతో హాస్పిటల్లో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మనోజ్ కు ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం వెంటనే తన భార్య భూమా మౌనికతో పాటు మరికొంత మందితో ఆసుపత్రికి మనోజ్ వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.


కాలికి బలమైన గాయాలు కావడంతో మనోజ్ నడవలేని స్థితిలో కనిపిస్తున్నారని సమాచారం.. ఈ విషయం తెలిసిన అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు..ప్రస్తుతం మనోజ్ కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారట. మరి ఈ క్రమంలోనే మనోజ్ ఈ విషయం పైన ఎలా స్పందిస్తారో చూడాలి.. అలాగే మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన ట్విట్ చేస్తూ..1979లో తన గురువు దాసరి నారాయణరావు గారు తెరకెక్కించిన కోరికలే గుర్రాలైతే సినిమా గురించి సోషల్ మీడియాలో తెలియజేశారు. మరి మొత్తానికి అటు మంచు కుటుంబంలో గొడవలు అనే విషయం ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలోని హాట్ టాపిక్ గా మారింది. మరి మొత్తానికి ఈ విషయానికి ఎప్పుడు పుల్ స్టాప్ పెడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: