ఈ మధ్య కాలంలో సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ హీరోలతో సినిమాలను చేస్తూ అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకుంటున్నారు. ఇక సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ హీరోలతో చేస్తున్న సినిమాలు కూడా ఎక్కువ శాతం మంచి విజయాలు సాధించడంతో బాలీవుడ్ స్టార్ నటులు సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఇకపోతే కొంత కాలం క్రితం హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ తమిళ సినిమా పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కూడా కొల్లగొట్టింది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సందీప్ రెడ్డి వంగా కొంత కాలం క్రితం బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ తో యానిమల్ అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ఏకంగా 900 కోట్లకు కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో రష్మిక తన నటన తో పాటు అందాలతో కూడా ప్రేక్షకులను కట్టి పడేసింది.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలీవుడ్ నటుడు అయినటువంటి సన్నీ డియోల్ హీరోగా జాట్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ని గోపీచంద్ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నాడు. ఇలా సౌత్ డైరెక్టర్లు హిందీ హీరోలతో మాస్ ఎంటర్టైనర్లను రూపొందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: