మెగా ఫ్యామిలీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందు వరుసలో ఉంటారు. ఇకపోతే ఈ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోలు తమ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ మెగా హీరోలు మాత్రం ప్రేక్షకుల ముందుకు ఈ సంవత్సరం ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం వాల్టేరు వీరయ్య , భోళా శంకర్ అనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అందులో వాల్టేరు వీరయ్య బ్లాక్ బాస్టర్ విజయం అందుకోగా , భోళా శంకర్ ఫ్లాప్ అయ్యింది. ఇక ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. దానితో చిరంజీవి నటించిన ఒక్క సినిమా కూడా ఈ సంవత్సరం విడుదల అయ్యే ఛాన్స్ లేదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఖరుగా బ్రో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పోయిన సంవత్సరం విడుదల అయ్యింది. ఇక ఈ సంవత్సరం ఇప్పటి వరకు పవన్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అలాగే ఈ సంవత్సరం ఈయన నటించిన సినిమాలు విడుదల అయ్యే అవకాశం కూడా లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఖరుగా తన తండ్రి అయినటువంటి చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో కనిపించాడు.

సినిమా విడుదల అయ్యి చాలా కాలం అవుతుంది. ఇక చరణ్ నటించిన ఒక్క సినిమా కూడా ఈ సంవత్సరం విడుదల అయ్యే అవకాశం లేదు. వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ విడుదల కానుంది. ఇలా మెగా ఫ్యామిలీ లో క్రేజీ హీరోలు అయినటువంటి ఈ ముగ్గురికి సంబంధించిన ఒక్క సినిమా కూడా ఈ సంవత్సరం విడుదల కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: