ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల కావడంతో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీపై ఆసక్తి జనాల్లో పెరిగిపోయింది. ఇకపోతే అల్లు అర్జున్ తన తదుపరి మూవీ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

వీరి కాంబో మూవీ వచ్చే సంవత్సరం జూన్ నెలలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని కొంత కాలం క్రితం ఓ వార్త వైరల్ అయింది. దానితో చాలా మంది కూడా అల్లు అర్జున్ చాలా సంవత్సరాలుగా పుష్ప సినిమాకే సమయాన్ని కేటాయించినందున కొంత కాలం రెస్టు తీసుకొని వచ్చే సంవత్సరం జూన్ నెల నుండి త్రివిక్రమ్ సినిమాను మొదలు పెడతాడు అని అంతా అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం పెద్దగా రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు అని తెలుస్తుంది. దానితో వచ్చే సంవత్సరం జనవరి నెలలో బన్నీ , త్రివిక్రమ్ కాంబో మూవీ అధికారిక ప్రకటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రారంభం అయ్యే లోపు మాత్రం అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ప్రశాంతంగా గడపబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మొదటగా జులాయి అనే మూవీ వచ్చింది.

ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి , అలా వైకుంఠపురంలో సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో వీరిద్దరి కాంబోలో రూపొందబోయే నాలుగవ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.L

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa