కోలీవుడ్ సూపర్ స్టార్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది రజినీకాంత్ పేరు మాత్రమే. అయితే అలాంటి రజినీకాంత్ నిజంగానే సినిమాలకు పులిస్టాప్ పెట్టబోతున్నారా.. అసలు రజినీకాంత్ సినిమాలకు పులిస్టాప్ పెట్టడానికి కారణం ఏంటి..ఆయన సినిమాలు మానేయాలి అని ఎందుకు అనుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో హిట్ సినిమాలతో తన రేంజ్ ఏంటో ఇండస్ట్రీ జనాలకు చాటి చెప్పారు. అలాంటి ఈయన ఏడుపాదుల వయసు దాటినా కూడా పాతికేళ్ల హీరోకి ఉండే ఎనర్జీతో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక రీసెంట్ గా ఈయన చేసిన వెట్టయాన్, జైలర్ వంటి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో చెప్పనక్కర్లేదు.

 ప్రస్తుతం ఈయన కూలి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున విలన్ గా అలాగే చాలామంది స్టార్ హీరోలు ఇందులో గెస్ట్ ఆప్పీరియన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కూలి సినిమా తర్వాత రజినీకాంత్ సినిమాలకు పులిస్టాప్ పెట్టబోతున్నట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఆయన ఆరోగ్యం సహకరించకపోవడమే ..ఈ మధ్యకాలంలో రజినీకాంత్ ఎక్కువగా అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ కి వెళ్తున్నారు. అలా రీసెంట్గా ఆయనకు సర్జరీ జరిగిన సంగతి కూడా మనకు తెలిసిందే.

ఇక ఆయన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈయన్ని చెక్ చేస్తున్న డాక్టర్లు అందరూ కూడా సినిమాలకు పులిస్టాప్ పెట్టి ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకోవడమే మంచిది అని సలహాలు ఇస్తున్నారట. ఇక ఈ విషయం తెలిసిన ఇంట్లో వాళ్ళు కూడా సినిమాలకి గుడ్ బై చెప్పండి అని ఫోర్స్ చేయడంతో రజినీకాంత్ కూలి సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట. అయితే జైలర్ -2 సినిమా కూడా వస్తుందో రాదో క్లారిటీ లేదు. మరి కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రజినీకాంత్ తన ఆరోగ్యం కోసం సినిమాలకు గుడ్ బై చెప్పి ఇంటి పట్టునే ఉంటారా.. లేక  సినిమాలు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: