టాలీవుడ్ యంగ్ టైగర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల ఎక్కించిన భారీ యాక్షన్ డ్రామా దేవర. సెప్టెంబర్ 27న పాన్ ఇండియా రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమాకు ముందు మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో తో రు. 500 కోట్ల వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 షూట్ లోకి దిగిపోయిన సంగతి తెలిసిందే. తారక్ ఇప్పుడు ముంబై టు హైదరాబాద్ అంటూ ఒక రేంజ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే షూట్లో దిగిపోతాడు. ఎన్టీఆర్ వార్ 2 కోసం ఒక స్టైలిష్ మేకోవర్ తో రెడీ అయిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్ గా తారక్ పెళ్ళిలో కనిపించాడు. ఇందులో తాను వైట్ అండ్ వైట్ డాషింగ్ లుక్ లో అదరగొట్టేశాడు. ఎన్టీఆర్ తో పాటు చిన్న కొడుకు ఉన్నాడు. వీరిద్దరూ కలిసి ఉన్న క్యూట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లేటెస్ట్ లుక్ లో అయితే ఎన్టీఆర్ అభిమానులు మంచి సర్ప్రైజ్ ఫీల్ అయ్యారని చెప్పాలి. ఏది ఏమైనా వార్ 2 లో అభిమానులకు ఒక రేంజ్ యాక్షన్ ట్రీట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ నుంచి రాబోతుంది అని చెప్పాలి. ఇక వార్ 2 సినిమా తర్వాత .. ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ దేవర 2 పట్టాలు ఎక్కించే అవకాశాలు ఉన్నాయి.