యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈమేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇక తారక్ నటించిన కొన్ని సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చిన కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన ఓ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఆ తర్వాత మెల్లి మెల్లిగా పుంజుకొని ఓ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఆ సినిమా ఏది ..? అనే వివరాలను తెలుసుకుందాం. 

కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ "నాన్నకు ప్రేమతో" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. జగపతి బాబు విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల , అవసరాల శ్రీనివాస్ , తారక్ కి సోదరుల పాత్రలో నటించారు. ఇకపోతే ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయింది. 

ఇక ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో  ఈ సినిమా అపజయం అందుకుంటుంది అని చాలా మంది భావించారు. కానీ ఈ సినిమా మెల్లి మెల్లిగా పుంజుకొని లాంగ్ రన్ లో ఏకంగా 54 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టి అదిరిపోయి రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని తారక్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: