సినిమా ఇండస్ట్రీ లోకి కొంత మంది చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన స్థాయికి చేరుకున్న వారు కూడా ఉన్నారు . ఇక పైన ఫోటోలో ఓ అమ్మాయి ఉంది కదా ... ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆ అమ్మాయి కేవలం 19 సంవత్సరాల వయసులోనే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాకుండా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకుంది. సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసి మొదటి ఎన్నికలలోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని ఏకంగా ఎంపి అయింది.

మరి పైన ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా ..? ఆమె మరేవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి మరియు రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్. ఈమె 19 సంవత్సరాల వయసులోనే సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ అనురాజ్ బసు దర్శకత్వం వహించిన గ్యాంగ్ స్టర్ మూవీ తో ఈ నటి వెండి తెరకు పరిచయమైంది. ఈ సినిమా లోని కంగనా నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. 

ఇక ఆ తర్వాత అనేక బాలీవుడ్ సినిమాలలో నటించిన కంగనా హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈమె ఏక్ నిరంజన్ అనే తెలుగు సినిమాలో కూడా నటించింది. ఇకపోతే కొంత కాలం క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఈమె బీ జే పీ పార్టీ తరఫు నుండి పోటీ చేసి మొదటి ఎన్నికల్లోనే గెలిచి ఎంపీ కూడా అయ్యింది. ఇలా సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా కంగనా సక్సెస్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: