సాదరణంగా ఒక హీరో కొత్త సినిమా తెరకెక్కుతుంది అంటే చాలు ఆ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతలా వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారో అనే విషయం తెలిసిందే. అయితే తమ అభిమాని హీరో సినిమాని తొందరగా రిలీజ్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో తెగ రిక్వెస్ట్లు పెడుతూ ఉంటారు. ఇక నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఎక్కడ కనిపించినా కూడా తమ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా ఇప్పటివరకు ఎంతోమంది అభిమానులు తమ అభిమాన హీరో సినిమాని తొందరగా రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేయడం చూశాము.


 కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. సినిమా రిలీజ్ లేట్ అయిన పరవాలేదు అంటూ చెప్పేస్తున్నారు ఒక హీరో అభిమానులు. కానీ తప్పకుండా హిట్టు కొట్టాల్సిందే అంటూ అటూ డైరెక్టర్ కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ హీరో ఎవరో కాదు నితిన్. హీరో నితిన్ మంచి హిట్ కొట్టి చాలా రోజులే అవుతుంది. ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న అవి హిట్ కావడం లేదు. కాగా ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అయ్యింది.


 ఇక ఇప్పుడు వీరిద్దరి హిట్ హిట్ కాంబినేషన్లోనే రాబిన్ హుడ్ అనే మూవీ తెరకెక్కుతుంది.  ఈ క్రమంలోనే ఈ సినిమాపై అటు నితిన్ భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. తప్పకుండా హిట్టు కొట్టాలని అనుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో అభిమాని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టగా దీనిపై డైరెక్టర్ స్పందించారు. వెంకీ అన్న కొన్ని ఫ్లాప్స్ తర్వాత నితిన్ కు భీష్మ రూపంలో విజయం దక్కేలా చేశావు. మళ్లీ రాబిన్ హుడ్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇస్తావ్ అన్న నమ్మకంతో ఉన్నాం. రిలీజ్ లేట్ అయిన పర్వాలేదు. మాకు హిట్ కావాలి అంటూ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా మూవీ ఎడిటింగ్ లాక్ చేసి చెబుతున్న బ్రదర్ రాబిన్ హుడ్ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకంతోనే ఉన్నాం. సపోర్ట్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ డైరెక్టర్స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: