ఎట్టకేలకు పుష్ప2 రిలీజ్ అయిపోయింది . ఎన్నో అవంతరాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మరి థియేటర్స్ లో సక్సెస్ఫుల్గా రిలీజ్ అయింది . గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది . సినిమా ఇండస్ట్రీ చరిత్ర తిరగరాసే కలెక్షన్స్ సాధించింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 641 కోట్లు మూడు రోజుల్లోనే కలెక్ట్ చేసి ఆల్ ఇండియా హిట్ గా నిలిచిపోయింది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు పుష్పరాజ్ గాడి  రూలింగ్ స్టార్ట్ అయింది అంటూ ఓ రేంజ్ లో ప్ర్శంసిస్తున్నారు జనాలు. అల్లు అర్జున్ కూడా సక్సెస్ స్పీచ్ లో చాలా హుందాగా మాట్లాడి తన గౌరవాన్ని నిలబెట్టుకున్నాడు .


కాగా ఇప్పుడు పుష్ప సినిమాలో నటించిన కొన్ని క్యారెక్టర్స్ హైలెట్గా మారుతున్నాయి. పుష్ప సినిమాలో సుకుమార్ ముందుగా వేరే వాళ్ళని కొని క్యారెక్టర్స్ కి అనుకున్నారట . కానీ వాళ్ళు రిజెక్ట్ చేయడంతో ఇలా మరొకరిని పెట్టి హిట్ కొట్టాడు . అయితే వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు . పుష్ప2 సినిమాలో హీరోగా మహేష్ బాబుని అనుకున్నాడు సుకుమార్ . కానీ ఆయన రిజెక్ట్ చేశారు . ఆ తర్వాత హీరోయిన్ గా పూజ హెగ్డే ని అనుకున్నారు . ఆమె డీ గ్లామరస్ లుక్ లో నటించను అంటూ రిజెక్ట్ చేసింది .



అయితే ఇప్పుడు మిగతా క్యారెక్టర్స్ కి సంబంధించిన విషయాలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. మంగళం శీను, దాక్షాయిని అదేవిధంగా పుష్పరాజ్ అన్న క్యారెక్టర్ లో నటించిన అజయ్ వీళ్ళ క్యారెక్టర్స్ ని మిస్ చేసుకున్న డీటెయిల్స్ వైరల్ గా మారాయి . దాక్షాయిని పాత్ర కోసం ముందుగా రమ్యకృష్ణణ ని అనుకున్నారట . కానీ ఆమె రిజెక్ట్ చేసిందట . అదే విధంగా మంగళం శీను పాత్ర కోసం మోహన్ బాబుని అనుకున్నారట . ఆయన కూడా ఈ కథను రిజెక్ట్ చేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు పుష్ప రాజ్ అన్న క్యారెక్టర్ లో కనిపించిన అజయ్ క్యారెక్టర్ కోసం కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టిని అనుకున్నారట . కానీ ఆయన సున్నితంగా ఈ పాత్రను రిజెక్ట్ చేసారట . రంగస్థలం సినిమా నుంచి ఆది పినిశెట్టికి శివకుమార్ కి మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది. కానీ ఆది పినిశెట్టి మాత్రం ఈ పాత్రను చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపలేదట. ఒకవేళ ఆయన ఈ పాత్రలో నటించి ఉంటే మాత్రం సినిమా వేరే లెవెల్ లో ఉండేది అని చెప్పడంలో సందేహం లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: