ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పుష్ప 2 హడావిడి పూర్తయింది .. ఇప్పుడు తర్వాత ఏంటి అని చర్చ అందరి లో మొదలయ్యింది . అల్లు అర్జున్ కమిట్మెంట్ ప్రకారం తన తర్వాత సినిమా దర్శకుడు త్రివిక్రమ్ తో చేయాల్సి ఉంది . అయితే ఈ సినిమా ప్రారంభం 2025 జూన్ లో ఉంటుందని అంతా అనుకున్నారు .. తాజా గా టాలీవుడ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే జనవరి లోనే ఈ సినిమా ప్రారంభం ఉంటుంద ని టాక్‌ నడుస్తుంది . సంక్రాంతి పండుగ తర్వాత ఓ మంచి వీడియో కట్ తో ఎప్పుడైనా ఈ సినిమా అప్డేట్ రావచ్చు అని తెలుస్తుంది .


ఇక ప్రస్తుతం బన్నీ , పుష్ప 2 సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు . మూడేళ్ల గా  ఇదే సినిమా తో ఎంతో బిజీ గా ఉండటం కారణం గా ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారట .. కాస్త బ్రేక్ తర్వాత  నెక్ట్స్‌ సినిమాల ను పట్టాలెక్కించే పని లో పడతారని అంటున్నారు . జానర్‌ ఏంటనేది తెలీదు కానీ .. ప్రస్తుతం త్రివిక్రమ్‌ కథ కథ , ప్రీ పొడక్షన్‌ పనుల్లో ఉన్నారని తెలుస్తుంది . ఇప్పటి కే అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్లో జులాయి’ , సన్నాఫ్‌ సత్యమూర్తి , అల వైకుంఠపురములో  సినిమాలు వచ్చి హ్యాట్రిక్ విజయాలు సాధించాయి .


ఇక ఇప్పుడు తాజా గా మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు . పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు రాబోతుంది . త్రివిక్రమ్ కు ఇదే తొలి పాన్ ఇండియా మూవీ .. అలాగే అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది .. త్రివిక్రమ్ తో చేసే సినిమాతో బన్నీ మాటల మాంత్రికుడు కి పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి క్రెజ్‌ తీసుకొస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: