ఇక అంచనాలకు తగ్గట్లుగానే ప్రేక్షకులను మెప్పించగలిగిన ఈ మూవీ.. భారీగా వసూళ్లు సాధిస్తుంది అన్న విషయం తెలిసిందే. కేవలం సౌత్ లో మాత్రమే కాదు అటు బాలీవుడ్ గడ్డపై కూడా మునుపేన్నడు లేని విధంగా రికార్డులు స్థాయి కలెక్షన్స్ సాధిస్తుంది పుష్ప మూవీ. ఇక ఇప్పటికే 1000 కోట్లకు చేరువలో ఒక ఎలక్షన్స్ సాధించేసింది అన్న విషయం తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లోనే 500 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసింది ఈ మూవీ. దీంతో ఇక ఈ సినిమా చూసేందుకు అటు థియేటర్లకు బారులు తీరుతూ ఉన్నారు ప్రేక్షకులు. కాగా ఇక్కడ కొంతమంది ప్రేక్షకులు ఇలాగే పుష్ప-2 సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్లగా.. వారికి వింత అనుభవం ఎదురయింది.
సాధారణంగా సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మొదట ఫస్ట్ హాఫ్ ప్రదర్శించిన తర్వాత ఇంటర్వెల్ బ్రేక్ ఇచ్చి సెకండ్ హాఫ్ ప్రదర్శించడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్ గా సెకండ్ హాఫ్ ప్రదర్శించారు. కేరళలోని కొచ్చిన్ సినీ పోలీస్ లో ఫస్ట్ ఆఫ్ కి బదులుగా సెకండ్ హాఫ్ ప్రదర్శించారు అని సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ తప్పిదాన్ని ప్రేక్షకులు కూడా గుర్తించలేదట. అంతేకాక సినిమాను మరింత ఎంజాయ్ చేశారట. కానీ ఇంటర్వెల్ సమయంలో అటు ఎండ్ కార్డు పడటంతో ఇక డబ్బులను తిరిగి ఇవ్వాలని థియేటర్ యాజమాన్యాన్ని ప్రేక్షకులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.