టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప 2. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో పుష్ప సినిమా చాలా తక్కువ రేట్ల తో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టింది. పుష్ప సినిమా ఏకంగా బాలీవుడ్ లో ప్రమోషన్లు లేకుండానే ఏకంగా రు. 100 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో పుష్ప 2 సినిమా పై కనివినీ ఎరుగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అందుకే పుష్ప 2 కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తి తో ఎదురు చూసిన సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ అవైటెడ్ చిత్రం రికార్డులు మీద రికార్డులు కొల్లగొడుతున్న ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ దూసుకు పోతోన్న సంగతి తెలిసిందే.
మరి తెలుగు స్టేట్స్ సహా హిందీ ఇంకా యూఎస్ మార్కెట్ లలో కూడా పుష్ప 2 భారీ వసూళ్లు నమోదు చేస్తోంది. ఇవన్నీ కేవలం మొదటి వీకెండ్ 5 రోజుల్లోనే నమోదు అవుతుండడం విశేషం. మరి ఇలా లేటెస్ట్ గా పుష్ప 2 యూఎస్ మార్కెట్ లో మరో భారీ మైల్ స్టోన్ అందుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. లేటెస్ట్ యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రం ఏకంగా 10 మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసి సూపర్ స్ట్రాంగ్ రన్ తో సెన్సేషనల్ లెవెల్లో దూసుకెళ్తుంది. దీంతో పుష్ప 2 మాత్రం అక్కడ ఆగేదేలే.. అన్న లెవెల్లో ఉందని ట్రేడ్ వర్గాలు ఫుల్ ఖుషీ తో ఉన్నాయి. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా సామ్ సి ఎస్ అదనపు నేపథ్య సంగీతం అందించాడు. అలాగే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 సినిమాకు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.