![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/rajamouli-64e2da08-4005-4faa-8497-7b79822a4974-415x250.jpg)
ప్రస్తుతం దుమ్ము లేపుతున్న భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప 2. అసలు ఈ సినిమా కేవలం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ ప్రేమికులను మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సినీ .. రాజకీయ సెలబ్రిటీలను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ సినిమా ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సెన్సేషనల్ హిట్ సినిమా సాధించిన విజయంతో పాటు రికార్డుల గురించి ఇండియా అంతా మాట్లాడుకుంటుంది.
ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథి గా వచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళి తాను కూడా పుష్ప 2 సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తి తో ఉన్నారని చెప్పారు. రాజమౌళి రిలీజ్ రోజే ఈ సినిమా చూసేశారని అందరూ అనుకున్నారు. అయితే రిలీజ్ రోజు కాదు జస్ట్ రీసెంట్ గానే దర్శకుడు రాజమౌళి పుష్ప 2 సినిమాను చూశారు. రాజమౌళి మామూలుగా ఏ బెనిఫిట్ షో అయినా కూడా బ్రమరాంభ లేదా మల్లిఖార్జున థియేటర్ల లో చూస్తారు.
కానీ అలా కాకుండా రాజమౌళి ఈ సారి మైత్రి థియేటర్స్ విమల్ లో పుష్ప 2 సినిమా ను సైలెంట్ గా చూసేసారు. నిన్ననే జక్కన్న సినిమా చూసినా కూడా .. ఇంకా ఈ సినిమా కోసం స్పందించక పోవడం ఇపుడు ఆసక్తిగా మారింది. తన రెస్పాన్స్ కోసం కొన్ని కోట్ల మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. మరి జక్కన్న పుష్ప 2 కోసం ఎలాంటి రివ్యూ అందిస్తారో ? చూడాలి.