తుళ్లూరు స్టేషన్లో టిడిపి, జనసేన కార్యకర్తలు డైరెక్టర్ వర్మ పైన పలు రకాల సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. గతంలో విచారణలో భాగంగా శుక్రవారం వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దండి అంటూ కూడా హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.. అలాగే మార్చిలో వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్, లోకేష్ పైన అనుచిత పోస్టులు పెట్టారని ఈయన పైన ఫిర్యాదు చేశారు. నవంబర్ 11న టిడిపి మండల కార్యదర్శి ఎం రామలింగయ్య ఫిర్యాదు చేయగా.. ఆ తర్వాత టిడిపి నాయకులు గుంటూరు జిల్లాకు, అనకాపల్లి జిల్లాకు చెందిన రవికమతంలో వర్మపై కేసు నమోదు కాగా రెండుసార్లు నోటీసులు ఇచ్చారట.
ప్రస్తుతం సినిమా షూటింగ్లో ఉండడం వల్ల వర్మ విచారణకు హాజరు కాలేనట్టు కొంత సమయాన్ని ఇవ్వాలని కోరారట.అయితే ఆ సమయంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటు ఫికేషన్ వేసిన రాంగోపాల్ వర్మ ఈ క్రమంలో పిటిషన్ పైన విచారణ జరపగా ఈ మూడు కేసులలో హైకోర్టు సైతం బెయిలు ఇచ్చింది. మొత్తానికి వర్మ ఈ కేసు నుంచి బయటపడతారా లేదా అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.