మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల క్రితం ధ్రువ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. 2016 వ సంవత్సరం డిసెంబర్ 9 వ తేదీన మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. మరి ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి 9 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. మరి ఈ సందర్భంగా ఈ సినిమా ఫుల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే వరకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 15.36 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 6.90 కోట్లు , నెల్లూరు లో 1.35 కోట్లు , కృష్ణ లో 3 కోట్లు , గుంటూరు లో 3.48 కోట్లు , వైజాగ్ లో 5.45 కోట్లు , ఈస్ట్ లో 3.15 కోట్లు , వెస్ట్ లో 2.65 కోట్ల కనెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 41.31 కోట్ల కలెక్షన్ లు వచ్చాయి. ఇక ఈ మూవీ కి కర్ణాటక ఏరియాలో 7.35 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.75 కోట్లు , ఓవర్ సీస్ లో 7.60 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 58.04 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి. అలా ఈ మూవీ ఆ సమయంలలో అద్భుతమైన కలక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: