- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . .

అభిమానుల మధ్య అపార్ధాలు ఉంటాయి ఏమో కానీ .. టాలీవుడ్ హీరోల సఖ్యత ఎన్నోసార్లు బయటపడింది. మరి ముఖ్యంగా నిన్నటి తరం లెజెండ్రీ సీనియర్లు చిరంజీవి - బాలకృష్ణ మధ్య అస్సలు పడదు అన్న ప్రచారం ఉంది. అయితే ఇటీవల జరిగిన బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేసి మల్టీస్టార‌ర్ సినిమా తీద్దామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అంతకు ముందు గౌతమిపుత్ర శాతకర్ణి ప్రమోషన్ సమయంలో ఇండస్ట్రీలు రాకుండా ఏకైక ఫ్రెండ్ చిరంజీవి అంటూ బాలయ్య చెప్పటం వైరల్ అయింది. ఇప్పుడు అన్‌స్టాప బుల్ షో లో మరోసారి సందర్భం వచ్చింది.


నవీన్ పోలిశెట్టి, శ్రీలీల గెస్టులుగా పాల్గొన్న తాజా ఎపిసోడ్ లో ఇద్దరి మధ్య బాలయ్య ఒక సరదా గేమ్ పెట్టారు. ఒక పాట పేరు చెప్పినప్పుడు ఎవరైతే ముందు బజర్ నొక్కి దాని హుక్ స్టెప్ వేస్తారో వాళ్ల‌కు ఒక పాయింట్ వ‌చ్చేలా ప్లాన్ చేశారు. ముందుగా బ‌న్నీ అల వైకుంఠపురములో బుట్టబొమ్మ ఇస్తే శ్రీలీల గెలుచుకుంది. తర్వాత ఇంద్ర దాయి దాయి దామ్మ వంతు రాగా ... ఇద్దరూ సరిగా రీ క్రియేట్ చేయలేకపోయారు. వెంట‌నే బాలయ్య ఈ పాయింట్ మన ముగ్గురికి కాదు నా బ్రదర్ చిరంజీవికి ఇచ్చేస్తున్నా అన‌డంతో ఒక్కసారిగా స్టూడియో చప్పట్లతో మారు మోగి పోయింది.


ఈ టాక్ షోలో నవీన్ పోలిశెట్టి , శ్రీలీల కెరీర్ ప్రారంభంలోని జ్ఞాపకాలు .. క‌ష్ట న‌స్టా ల‌తో పాటు ఎన్నో కబుర్లు పంచుకున్నారు. ఈ జోడి నిజానికి సితార బ్యానర్ లో అనగనగా ఒక రాజు సినిమా చేయాల్సి ఉన్నా కూడా ... రెండేళ్ల క్రితం ప్రకటన వచ్చాక అర్ధాంతరంగా ఆగిపోయింది. మ‌ళ్లీ భ‌విష్య‌త్తు లో ఈ జోడీ లో సినిమా ప‌ట్టాలు ఎక్కుతుందేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: