టాలీవుడ్ టాల్ లేడీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి జనాలకి చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త నెమ్మదించింది కానీ, దాదాపు మూడు నాలుగు సంవత్సరాల క్రితం వరకు రకుల్ హవా టాలీవుడ్లో బాగానే కొనసాగింది. దాదాపు అర్ధ దశాబ్దం పాటు ఈమె హవా కాస్త గట్టిగానే కొనసాగిందనే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో రకుల్ పదుల సంఖ్యలో సినిమాలను చేసింది. సీనియర్ హీరోల నుండి జూనియర్ హీరోల వరకు అందరి సరసన నటించి మెప్పించింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక రకుల్ ఫిట్ నెస్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిమ్ చేయడంలో ఆమె మగాళ్లతో పోటీ పడుతుంది అని చెప్పుకోవచ్చు. అందుకే 35 ఏళ్ల వయస్సులో కూడా రకుల్ 25 ఏళ్ల అమ్మాయిలా కనబడుతుంది.

అయితే, దేనికైనా లిమిట్ అనేది ఉంటుంది కదా. అదే జిమ్ వర్కవుట్స్ ఆమెకి అనారోగ్యాన్ని కలిగించాయి. దాంతో ఆమె నేటి ఔత్సాహిక యువతకి పాఠాలను చెబుతోంది. అధికంగా వర్కవుట్స్ చేస్తే ఇక్కట్లు తప్పవని అంటోంది. ఓ పరిధిని మించి వ్యాయామం చేయడం కూడా అంత మంచిది కాదని అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే, ర‌కుల్ ప్రీత్ సింగ్ కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా బీపీ డౌన్ అవ్వ‌డం, చెమ‌ట‌లు ప‌ట్ట‌డంతో ఆమె తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైంది.

అవును, వర్కౌట్ సెషన్‌లో భాగంగా 80 కిలోల డెడ్‌లిఫ్ట్ ను బలవంతంగా ఎత్త‌డంతో వీపుకు గాయమైంది. వెన్న‌పూస పై ఆ బ‌రువు ప్ర‌భావం చూపడంతో ఈ సమస్య వచ్చింది. పైగా న‌డుముకు ఎలాంటి సేప్టీ బెల్డ్ ధ‌రించ‌కుండా చేయ‌డంతో ఆమెకి గాయమైంది. దీంతో వారానికి పైగా ఆమె బెడ్ రెస్ట్ లోనే ఉంది. ఇప్పుడిప్పుడే ఆమె క్ర‌మంగా కోలుకుంది. నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డంతో ర‌కుల్ `దేదే ప‌ర్యార్ దే2` షూటింగ్ కి య‌ధావిధిగా హాజరవుతోందని సమాచారం. అయితే నొప్పి రోజు రోజుకి ఎక్కువ అవ్వ‌డంతో ఫిజియో థెర‌పీ చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక గాయం కారణంగా ర‌కుల్ L4, L5, S1 నరాలు జామ్‌ అయ్యాయని సమాచారం. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: