ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉన్న ఎంతో మంది ముద్దుగుమ్మలు ఐటమ్ సాంగ్స్ చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న ఎంతో మంది హీరోయిన్లు ఇప్పటికే అనేక సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేశారు. ఇకపోతే కొంత మంది ముద్దుగుమ్మలు స్టార్ ఈమేజ్ ఉన్న సమయంలో ఐటమ్ సాంగ్స్ చేసిన కేవలం ఒకే ఒక ఐటమ్ సాంగ్స్ తో ఆపేసిన వారు కూడా ఉన్నారు. అలా ఒకే ఒక ఐటమ్ సాంగ్ తో ఆఫర్లు వస్తున్న ఐటమ్ సాంగ్స్ చేయని ముద్దుగుమ్మలు ఎవరో తెలుసుకుందాం.

అనుష్క : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరీర్ను కొనసాగిస్తున్న సమయంలో ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన స్టాలిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది. అలాగే ఇందులో అనుష్క కూడా తన అందాలతో , డాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు అనుష్క వేరే ఏ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు.

కాజల్ అగర్వాల్ : ఈ బ్యూటీ టాప్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా హిట్ అయింది. ఈ సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది. అలాగే కాజల్ కూడా ఈ సాంగ్లో తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఆ తర్వాత కాజల్ ఇప్పటివరకు మళ్ళీ స్పెషల్ సాంగ్ చేయలేదు.

సమంత : ఈ ముద్దుగుమ్మ పుష్ప పార్ట్ 1 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న మళ్ళీ సమంత ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు.

శ్రీ లీల : ఈ బ్యూటీ తాజాగా పుష్ప పార్ట్ 2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇక మళ్ళీ ఈమె స్పెషల్ సాంగ్ చేసే ఆలోచన చేయడం లేదు అని ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ ముద్దుగుమ్మ అనుష్క , కాజల్ , సమంత మాదిరి స్పెషల్ సాంగ్స్ కి దూరంగా ఉంటుందా లేదా స్పెషల్ సాంగ్స్ చేస్తుందా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: