ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమా తాజాగా డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేస్తోంది. ఇలా ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేస్తూ ఉండటం మాత్రమే కాకుండా అనేక సరికొత్త రికార్డులను కూడా సృష్టిస్తూ ఫుల్ జోష్ లో ముందుకు దూసుకు పోతుంది.

తాజాగా ఈ మూవీ కొత్త ఓ రికార్డు ను సృష్టించింది. అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటివ రకు తెలుగు సినిమా పరిశ్రమ నుండి విడుదల అయిన సినిమాలలో డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన మూవీ లలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో పుష్ప పార్ట్ 2 టాప్ లో నిలిచినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు డిసెంబర్ నెలలో విడుదల అయిన ఏ సినిమా కూడా పుష్ప పార్ట్ 2 సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేయనట్లు దానితో డిసెంబర్ నెలలో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాలు లిస్టు లో మొదటి స్థానంలో పుష్ప పార్ట్ 2 నిలిచినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో మైత్రి సంస్థ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ మరి కొన్ని రోజుల పాటు అద్భుతమైన కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: