నాలుగు రోజుల్లో హైయెస్ట్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన టాప్ 6 ఇండియన్ మూవీస్ ఏవో తెలుసుకుందాం.

పుష్ప పార్ట్ 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 800 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 4 రోజుల్లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన ఇండియన్ సినిమాలలో మొదటి స్థానంలో నిలిచింది.

బాహుబలి 2 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా 4 రోజుల్లో 625 కోట్ల కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి రెండవ స్థానంలో నిలిచింది.

ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 565 కోట్ల కలెక్షన్లను రాబట్టి 3 వ స్థానంలో నిలిచింది.

కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 57.45 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 4 వ ప్రస్థానంలో నిలిచింది.

జవాన్ : షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 520 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 5 వ స్థానంలో నిలిచింది.

కల్కి 2898 AD : ప్రభాస్ హీరోగా దిశా:పటాని హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 507.30 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 6 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: