మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ .. ఇక దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత దేవర సినిమాతో సోలో హీరోగా వచ్చి పాన్ ఇండియా లెవెల్ లో మరోసారి తన క్రేజ్‌ ఏంటో చూపించాడు .. ఈ సినిమా ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఎన్టీఆర్ క్రేజ్ ఎంటో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ కి చూపించింది .. అలాగే దర్శకుడు కొరటాల శివకి ఆఛార్య లాంటి డిజస్టర్ తర్వాత మరోసారి పాన్ ఇండియా దర్శకుడుగా దేవరతో ప్రూవ్ చేసుకున్నాడు.. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా దేవర 2 ప్రేక్షకుల ముందుకు రానుంది .. ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం బాలీవుడ్ లో వార్‌2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.. అలాగే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు.


అయితే ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు , బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి .. అలాంటి సినిమాల్లో ఎన్టీఆర్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టిన స్టూడెంట్ నెంబర్ 1న్ సినిమా కూడా ఒకటి .. ఎన్టీఆర్‌కు ఫస్ట్ సక్సెస్ ఇచ్చిన సినిమా కూడా ఇదే .. ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించారు .. అలాగే ఈ సినిమాకి దర్శకేంద్రుడు కే రాఘవేందర్రావు పర్యవేక్షణ చేశారు .. 2001 సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ అయింది .. మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ను సొంతం చేస్తుంది .. అలాగే ఎంఎం కీరవాణి అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.


అప్పట్లో ఈ సినిమా 42 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడి అదిరిపొయో రికార్డు క్రియేట్ చేసింది.  ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. తొలి షో నుంచే యావరేజ్ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ దూసుకుపోవటంతో డాడీ సినిమాని ప్రేక్షకులు అసలు పట్టించుకోలేదు .. ఎన్టీఆర్ తో తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ రాజమౌళికి మొదటి సినిమా కావటం విశేషం .. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న రాజమౌళి అప్పట్నుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడుగా ఇండియాలోనే నెంబర్ 1న్ దర్శకుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: