మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు చిరు .. ఇక చిరంజీవి తన నటనతో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు .. ఆయన నటించే ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎన్నో అర్దైన రికార్డులు సృష్టించాయి .. అలాగే ఆయన నటించిన ఎన్నో సినిమాలు వంద రోజులు కూడా ఆడాయి. ఇప్పటికీ చిరంజీవి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు ..


అయితే గత కొంతకాలంగా చిరంజీవి చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోతున్నాయి .. ఒకప్పుడు చిరంజీవి సినిమా వస్తుందంటే థియేటర్లు వద్ద పండగ వాతావరణం ఉండేది .. కానీ గత గాడ్ ఫాదర్ , భోళ‌శంకర్ సినిమాల దగ్గర నుంచి చిరంజీవి సినిమాలపై ఆసక్తి ప్రేక్షకుల్లో తగ్గింది .. సరైన కథలను ఎంచుకోవడంలో చిరంజీవి ఫెయిల్ అవుతున్నారు .. ఇక ప్రస్తుతం మెగాస్టార్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభ‌ర లో నటిస్తున్నాడు .. వచ్చే సమ్మర్ కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.. అలాగే నానితో దసరాతో హిట్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఒడెలాతో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు చిరు.


ఇదే క్రమంలో చిరంజీవి కెరియర్ లో ఒక సినిమా గురించి ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవాలి.   ఆ సినిమా షూటింగ్ కు కేవలం నెలరోజుల సమయం కూడా పట్టలేదు .. కేవలం 29 రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశారు .. అలా ఈ సినిమా రిలీజ్ అయి 500 రోజులు ఆడింది .. ఇంతకీ ఆ సినిమా పేరు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య .. 1982లో చిరంజీవి , మాధవి హీరో హీరోయిన్లుగా నటించారు .. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 29 రోజుల షూటింగ్లో పూర్తయింది .. 512 రోజులు ఆడి  చిరంజీవి కెరియర్ లోనే అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.  ఇలా ఈ సినిమా చిరంజీవి కెరియర్ లోని మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: