అక్కినేని నాగార్జున గురించి కొత్త గా పరిచయం అవసరం లేదు .. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడి గా తెలుగు చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా ఎదిగాడు .. ఆరుపదుల వయసు దాటినప్పటికీ అదే అందం తో కుర్ర హీరో గా కనిపిస్తూ ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తుంటారు . తన విలక్షణమైన నటన కు గాను కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు .


ఇక‌ నాగార్జున సినిమాల్లో నటిస్తున్న సమయం లోనే టాలీవుడ్ లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కూతురు  , వెంకటేష్ చెల్లెలు లక్ష్మి తో ఇరు కుటుంబాల సభ్యులు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు .. నాగచైతన్య కూడా జన్మించాడు .. అయితే పెళ్లయిన కొన్ని రోజుల కే వీరి మధ్య మనస్పర్ధలు రావడం తో విడాకులు తీసుకుని విడిపోయారు .. ఇక దీంతో నాగ‌ చైతన్య నాగార్జున వద్దే ఉన్నాడు .. విడాకుల తర్వాత కొన్ని సంవత్సరాల కు నాగార్జున మరో హీరోయిన్ అమల ను పెళ్లి చేసుకున్నాడు .


ఇక వీరిద్దరికీ అఖిల్ జన్మించాడు .. ఇక నాగార్జున తో విడాకులు తర్వాత లక్ష్మి కూడా శరత్ అనే ఓ డాక్ట‌ర్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికా లో సెటిలైంది .. అయితే నాగచైతన్య బాధ్యతలన్నీ నాగార్జున తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా దగ్గరుండి మరి చూసుకునేవాడ ని ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది .. రీసెంట్ గానే నాగచైతన్య హీరోయిన్ శోభిత  ను పెళ్లి చేసుకున్నాడు . .   ఈ పెళ్లి సమయంలో కూడా నాగచైతన్య తల్లి లక్ష్మి దగ్గుబాటి కుటుంబం తో పాటు వచ్చి కొడుకు ను ఆశీర్వదించింది .. అలాగే అక్కినేని కుటుంబం లో ఎలాంటి ఫంక్షన్ జరిగిన లక్ష్మి తన కొడుకు నాగచైతన్య తో కలిసి పాల్గొంటుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: