ముఖ్యంగా ఒక ప్రముఖ ఛానల్ మైకు లాక్కొని మీడియా పైన దాడి చేసినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అయితే ఇలాంటి సమయంలో జల్లిపల్లిలో హై టెన్షన్ నెలకొనడంతో పోలీసులు సైతం అక్కడ రంగంలోకి దిగి వెంటనే అక్కడ అందరిని పంపించేస్తున్నారు. ముఖ్యంగా మోహన్ బాబు ఇంటిని సైతం పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు. అలాగే మరొకవైపు మోహన్ బాబు, మంచు విష్ణు గన్స్ సైతం సీజ్ చేయాలని ఉన్నత అధికారులు సైతం ఆదేశాలను జారీ చేసినట్లు సమాచారం.
మొత్తానికి మంచు కుటుంబం పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారిపోయింది అనే విధంగా అభిమానులు తెలియజేస్తున్నారు.. మనోజ్ కూతురు లోపల ఉందని గేటు తెరవండి అంటూ మంచు మనోజ్ అభ్యర్థించినప్పటికీ ఎంతసేపటికి కూడా మనోజ్ లోపలికి దానివకపోవడంతో ఆ గేటుని బలవంతంగా తన బౌన్సర్లతో గేటుని బలవంతంగా తొలగించి మరి లోపలికి వెళ్లినట్లుగా కనిపిస్తోంది. అయితే మోహన్ బాబు అక్కడ ఉన్న మీడియా మిత్రుల పై తమ సహనాన్ని కోల్పోయిన మోహన్ బాబు విచక్షణ రహితంగా మీడియా పైన ఇలా దాడి చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి మంచు కుటుంబంలో జరుగుతున్న ఈ వివాదం ఎప్పుడు కి తగ్గిపోతుందో చూడాలి మరి.