సందడి చేయడం కాదు ఏకంగా జాతర గెటప్ లో భారీగా వసూళ్లు సాధిస్తూ విలయతాండవం చేసేస్తూ ఉన్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే పుష్ప సినిమా ఏకంగా 1000 కోట్ల వసూళ్లకు దగ్గరగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీకి పార్ట్ 3 కూడా ఉంటుంది అన్న విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. అయితే దాదాపు 5 ఏళ్ల నుంచి పుష్పా సినిమాకి టైం కేటాయించిన అల్లు అర్జున్.. ఇప్పుడు మరో డైరెక్టర్ తో సినిమా చూసేందుకు రెడీ అవుతున్నారు. త్రివిక్రమ్ తో ఒక సినిమాను ఇప్పటికే సైన్ చేసేసాడు అన్న విషయం తెలిసిందే.
పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మాటల మంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే హిట్స్ ఉండడం.. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనేదానిపై కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా ఈ మూవీ గురించి నిర్మాత నాగ వంశీ పలు కీలక విషయాలను వెల్లడించారు. బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ కి సంబంధించి జనవరిలో అనౌన్స్మెంట్ ప్రోమో రిలీజ్ అవుతుందని.. కథ మొత్తం దాదాపు అయిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. మార్చి నుంచి బన్నీ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇది గతంలో ఎవరు టచ్ చేయని జోనర్లో ఉంటుంది. ఇది మాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అంటూ చెప్పి అభిమానుల్లో ఉన్న అంచనాలను రెట్టింపు చేసాడు నిర్మాత నాగ వంశీ.