ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే మొదటి నాలుగు రోజుల పాటు ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. మొదటి నాలుగు రోజులతో పోలిస్తే 5 వ రోజు ఈ మూవీ కి కాస్త కలెక్షన్లు తగ్గాయి. మరి 5 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాల లిస్టులో ఏం ప్లేస్ లో ఉందో తెలుసుకుందాం.

రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.63 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలవగా , అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమా 11.43 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా 11.35 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో నిలవగా , ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా 10.86 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో నిలిచింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా 10 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో నిలవగా , మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమా 9.69 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలో నిలిచింది. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల ఆయన 5 వ రోజు 9.02 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా ఏడవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: