ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ ప్రస్తుతం ఒక వైపు రికార్డుల పరంపర కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం పుష్ప2 మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిపోయినట్లు తెలుస్తొంది.  అయితే.. ఈ మూవీ ఒకవైపు రికార్డుల పరంగా వార్తలలో ఉంటే.. మరొవైపు కాంట్రవర్సీ అంశాల పరంగా కూడా రచ్చగా మారుతుంది. ఈ మూవీ ఇటీవల రీలీజ్ అయినప్పుడు హైదరబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.కాగా.. ఈ వ్యవహారంలో పలువురు ఇచ్చిన ఫిర్యాదులతో పాటు పోలీసులు కూడా అటు అల్లు అర్జున్ టీమ్ మీద, సంధ్య థియేటర్ యాజమాన్యం మీద పలు కేసులు నమోదు చేశారు. ప్రేక్షకుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంధ్య థియేటర్ మీద, థియేటర్‌కు వస్తున్నట్టు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీమ్ మీద చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.ఇదే ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యజమాని కోర్టును ఆశ్రయించారు. థియేటర్ యజమాని రేణుకా దేవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవతి మృతితో తమకు సంబంధం లేదని పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రీమియర్, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, పుష్ప-2 సినిమాకు తాము ప్రీమియర్ షోలు నిర్వహించలేదన్నారు. డిస్ట్రిబ్యూటర్లే నేరుగా సినిమాను నడిపించుకున్నట్లు చెప్పారు. అయినప్పటికీ తమవంతుగా బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.అలాంటి తమపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. మరి అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఓనర్లు వేసిన పిటిషన్లపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: