ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేననే సంగతి తెలిసిందే. బన్నీ తన కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ హీరోకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంచనాలకు మించి పెరుగుతోంది. పుష్ప ది రూల్ ఘన విజయం బన్నీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్లస్ అయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు బన్నీ రానున్నారని తెలుస్తోంది.
 
పుష్ప ది రూల్ ఇప్పటికే 1000 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్కును అందుకుంది. బాహుబలి2 ఫుల్ రన్ కలెక్షన్లను ఈ సినిమా బ్రేక్ చేసే ఛాన్స్ అయితే లేదు కానీ ఆ సినిమా తర్వాత స్థానం మాత్రం ఈ సినిమా సొంతమయ్యే ఛాన్స్ ఉంది. ఫుట్ ఫాల్స్ విషయంలో నాత్రం బన్నీనే టాప్ అని ఈ విషయంలో బన్నీకి తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
మరోవైపు బిగ్ బాస్ సీజన్8 ఊహించని స్థాయిలో ఫ్లాప్ అయింది. షో నిర్వాహకులు ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో గత సీజన్ ను హిట్ చేయగా ఈ సీజన్ మాత్రం అంచనాలను అందుకోలేదు. నాగార్జున హోస్టింగ్ పై కూడా నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ విజేతకు బన్నీ ట్రోఫీ అందిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
 
మరోవైపు సంధ్య థియేటర్లో తొక్కిసలాట వివాదం విషయంలో పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయగా బన్నీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం విషయంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ మూవీ నార్త్ ఇండియాలో హవా కొనసాగిస్తోంది. పుష్ప ది రూల్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: