నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తన సహజమైన యాక్టింగ్ తో ఎంత మందిని ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి ఈ బ్యూటీ నటించిన అమరన్ మూవీ రీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా ఓటీటిలో కూడా దుమ్ములేపుతోంది. మేజర్ ముకుందన్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ముకుంద ఉన్నికృష్ణన్ భార్య ఇందూ రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి తన నటనతో  ఇరగదీసింది. అయితే ఈ సినిమా విడుదలయ్యాక సాయి పల్లవి క్రేజ్ మరింత పెరిగింది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో తండేల్ హిందీలో రామాయణం మూవీలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ పై ఒక మీడియా ఛానల్ వాళ్ళు తప్పుడు వార్తలు రాశారు. అయితే ఈ తప్పుడు వార్తలపై సాయి పల్లవి ఘాటుగా స్పందించింది.

అంతే కాదు లీగల్ గా యాక్షన్ తీసుకొని కేస్ కూడా పెడతానంటూ వార్నింగ్ ఇచ్చింది.మరి ఇంతకీ సాయి పల్లవి పై వాళ్ళు రాసిన తప్పుడు వార్తలు ఏంటయ్యా అంటే.. సాయి పల్లవి చిన్నప్పటినుండి నాన్ వెజ్ తినదు. ఆమె పూర్తిగా వెజిటేరియన్. అయితే ఈ విషయం చాలామందికి తెలుసు. కానీ కావాలనే ఓ మీడియా ఛానల్ వాళ్ళు సాయి పల్లవి ప్రస్తుతం రామాయణం మూవీ లో సీత పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నటించినప్పటి నుండి సాయి పల్లవి పూర్తిగా వెజిటేరియన్ గా మారిపోయింది. ఆమె నాన్ వెజ్ అస్సలు ముట్టడం లేదు. చాలా నిష్టగా ఉంటుంది అని రాసుకోచ్చారు. అయితే సాయి పల్లవి చిన్నప్పటినుండే నాన్ వెజ్ తినదు.

కానీ ఈ మీడియా ఛానల్ వాళ్ళు మాత్రం కేవలం రామాయణం మూవీలో నటిస్తున్నందుకే నాన్ వెజ్ తినడం లేదు.. లేకపోతే తింటుంది అని అర్థం వచ్చేలా వీళ్ళు తప్పుడు వార్తలు రాశారు. అయితే ఈ తప్పుడు వార్తలపై ఫైరైన సాయి పల్లవి ఇంకెప్పుడూ ఇలాంటి వార్తలు నాపై రాయకండి.అయితే గతంలో నేను ఇలాంటి వార్తలను అంతగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఇవి హద్దులు మీరినప్పుడు పట్టించుకోక తప్పడం లేదు. నా సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి వార్తలు ఇంకొకసారి ప్రచారం చేస్తే వారిపై లీగల్ గా యాక్షన్ తీసుకొని కేసు పెట్టాల్సి వస్తుంది అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవి ఇచ్చిన వార్నింగ్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: