టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో తేజ సజ్జ ఒకరు. ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఆ సమయంలోనే అద్భుతమైన గుర్తింపును నటుడిగా సంపాదించుకున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో ఈయన వరుస పెట్టి సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తేజ కొంత కాలం క్రితమే హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయగా ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా తేజకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

ఇకపోతే ప్రస్తుతం ఈ యువ నటుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో టాలెంటెడ్ నటుడు మంచు మనోజ్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత తేజ నటిస్తున్న మూవీ కావడం , ఇందులో మనోజ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ సీనియర్ నటీమణి శ్రేయ స్పెషల్ సాంగ్లో కనిపించబోతున్నట్లు , ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ ముద్దుగుమ్మను ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించగా ఈమె అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈమె కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తన డాన్స్ తో , అంతకుమించిన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి నిజంగా మీరాయ్ సినిమాలో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేస్తే ఆ స్థాయి అందాలతో , డాన్స్ తో ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: