పుష్ప2 .. పుష్ప2..పుష్ప2.. ఏ నోట విన్నా సరే ఇదే మాట వినిపిస్తుంది . సినిమా రిలీజ్ అయి ఆరు రోజులు దాటేసింది . అయినా సరే పుష్ప రాజ్ రూలింగ్ ఇంకా థియేటర్స్ లో కొనసాగుతూనే ఉంది . ఒకటి కాదు రెండు కాదు దాదాపు 12,500 థియేటర్ లలో రిలీజ్ అయిన మొట్టమొదటి తెలుగు సినిమాగా సంచలన రికార్డు క్రియేట్ చేసిన పుష్ప2 సినిమా ఇప్పుడు ఇండియన్ హిస్టరీ లోనే బిగ్ రికార్డ్ క్రియేట్ చేసింది.  కాగా పుష్ప 2 సినిమా హిట్ అవ్వడానికి ది వన్ అండ్ ఓన్లీ రీజన్ సుకుమార్ అంటూ చాలా మంది చెప్తున్నారు .


మరి కొందరు మాత్రం అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ వేరే లెవెల్ లో ఉంది అంటూ పొగిడేస్తున్నారు . నిజమే అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించిన విధంగా ఇంతకుముందు వేరే ఏ  సినిమాలో కూడా నటించలేదు.  ఆ మాటకొస్తే ఏ తెలుగు హీరో కూడా ఇంత బిగ్ రిస్క్ చేసి అలాంటి ఒక నటనను కనబరచలేదు . సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కాయి . 1000 కోట్ల క్లబ్ లోకి కూడా చేరాయి.  కానీ అల్లు అర్జున్ లా చీర కట్టుకొని అమ్మవారు పూనినట్టు వేసిన డాన్స్ ఇప్పటివరకు ఏ తెలుగు హీరో వేయకపోవడం గమనార్హం.



అయితే పుష్ప2 సినిమా షూట్ లో భాగంగా అల్లు అర్జున్ చీర కట్టుకోవాలి అని చెప్పినప్పుడు సుకుమార్.. బన్నీ అస్సలు ఒప్పుకోలేదట. నేనేంటి ..? చీర కట్టుకోవడం ఏంటి ..? అంటూ ఫుల్ ఫైర్ అయిపోయారట . ఆ తర్వాత నెమ్మదిగా అసలు ఎందుకు కట్టుకోవాలి అని చెప్తూ.. సీన్ క్లీయర్ గా వివరించారట.  అల్లు అర్జున్ షాక్ అయిపోయాడట . కానీ మనసులో మాత్రం ఆ భయం అలాగే ఉండిపోయిందట . పాన్ ఇండియా స్టార్ ఇలా చీర కట్టుకుంటే ఎక్కడ నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుందో అంటూ భయపడ్డాడట .



కానీ సుకుమార్ ..సుకుమార్ భార్య తభిత చాలా నమ్మకంగా ఈ సీన్స్ హైలైట్ అవుతాయి అంటూ ధీమా వ్యక్తం చేయడంతో స్నేహారెడ్డి కూడా సపోర్ట్ చేయడంతో అల్లు అర్జున్ ఈ డెసిషన్ తీసుకున్నారట . ఒకవేళ అల్లు అర్జున్ ఆ రోజు భయపడిపోయి అలాంటి సీన్ వద్దు తీసేసేయ్ అని ఉంటే మాత్రం కచ్చితంగా పుష్ప2 సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యి ఉండేది . ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా జాతర సీన్ గురించే మాట్లాడుకుంటున్నారు.  అసలు ఆరు రోజుల్లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది అంటే కచ్చితంగా దాని పూర్తి క్రెడిట్ జాతర ఎపిసోడ్ కనే చెప్పాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: