ఫైనల్లీ బన్నీ ఫాన్స్ కోరుకున్నదే జరిగింది . ఎప్పుడెప్పుడు పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతుందా ..? ఎప్పుడెప్పుడు బాక్స్ ఆఫీస్ చరిత్ర తిరగరాస్తుందా..? అంటూ 1000 కళ్ళతో వెయిట్ చేశారు అభిమానులు. పుష్ప 2 సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరింది . అంతేనా ఇండియన్ హిస్టరీలోనే చాలా తక్కువ టైంలోనే 1000 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా రికార్డ్ సృష్టించింది . ఇటువంటి రికార్డు ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా సాధించలేదు . ఆ మాటకొస్తే ఇండియన్ హిస్టరీలో ఏ మూవీ కూడా ఇలాంటి రికార్డు క్రియేట్ చేయలేకపోయింది.


దీంతో పుష్ప రాజ్ పేరు ఓ రేంజ్ లో దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది . పుష్ప 2 సినిమా వెయ్యికోట్లు రికార్డ్ క్రాస్ చేసింది . ఓకే గుడ్ . హిందీలో కూడా అత్యధికంగా మొదటి రోజే ఎక్కువ కలెక్షన్స్  కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది అది కూడా బాగానే ఉంది . పలు భాషలలో సైతం పుష్ప2 సినిమా రేర్ రికార్డ్స్ అచీవ్ చేసింది . అయితే మెగా హీరో నుంచి మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి మాత్రం రివ్యూ అందుకోలేకపోయింది . సాధారణంగా ఏ తెలుగు హీరో అయినా సరే సినిమాకి 100 కోట్లు వచ్చిన రాని ఆనందం మెగాస్టార్ చిరంజీవి రివ్యూ ఇస్తే వస్తుంది అని భావిస్తూ ఉంటారు .



అయితే పుష్ప 2 సినిమాకి చిరంజీవి రివ్యూ ఇవ్వకపోవడం గమనార్హం. ఫ్యామిలీ గొడవల కారణంగానే రివ్యూ ఇవ్వలేదు అంటూ టాక్ వినిపిస్తుంది. అయితే 1000 కోట్ల క్లబ్ లోకి చేరిన మెగా రివ్యూ తీసుకోలేకపోయాడు అన్న రిమార్క్ మాత్రం అలాగే ఉండిపోయింది అంటున్నారు జనాలు . దీంతో పుష్పరాజ్ పేరు మరొకసారి ట్రోలింగ్ కి గురవుతుంది. నిజమే.. పుష్ప 2 విషయంలో బన్నీ అన్ని రికార్డ్స్ అచీవ్ చేశారు. కానీ అది మాత్రమే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: