బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్రం ద్వారా ఒక్కసారిగా భారీ పాపులారిటీ సంపాదించుకుంది హాట్ బ్యూటీ హనీ రోజ్. వీరసింహారెడ్డి తర్వాత ఈమె పేరు భారీగా పాపులారిటీ సంపాదించింది.. ముఖ్యంగా హాని రోజ్ ఇన్ని రోజులు ఎక్కడ ఉంది అని అభిమానులు కూడా తెగ వెతికేశారు.. వాస్తవానికి ఈమె మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అయినప్పటికీ వీరసింహారెడ్డి సినిమా కంటే ముందుగా పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది.. అయితే అప్పుడు అంతగా గుర్తింపు రాకపోవడంతో ఎక్కువగా మలయాళ సినిమాలపైనే దృష్టి పెట్టిందట.


మళ్లీ చాలా కాలం తర్వాత వీర సింహారెడ్డి చిత్రంతో తిరిగి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడు భారీ క్రేజీ సంపాదించుకొని సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ అందుకుంది.. ఈమె క్రేజ్ ఎలాంటిదంటే సినిమాలలో కంటే ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తోనే భారీగా సంపాదిస్తోంది. ప్రస్తుతం రాచెల్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.ఈ సినిమా కూడా మలయాళం తో పాటు అన్ని భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.


హనీ రోజ్ తనకు కాబోయే వారి గురించి తెలియజేస్తూ ఒకప్పుడు ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకునే దాన్ని కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది .ఇప్పుడు అలా కాదు మంచివాడు వస్తే చాలు వివాహం చేసుకుంటానని తనకు సరిపోయో వ్యక్తి కావాలని మాత్రం తెలియజేసింది హనీ రోజ్.. అలాంటి వ్యక్తి తనకు చూడగానే అర్థమవుతుందని కుటుంబాన్ని గౌరవించే వ్యక్తి అయి ఉండాలి అలాగే తన కోరికలకు సైతం ఎప్పుడూ కూడా అడ్డు చెప్పకూడదని అతనిలో స్వార్థం ఉండకూడదని వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ.. తనకు సినిమాలలో కంటే ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ అంటేనే ఎక్కువ ఇష్టమని.. ప్రారంభోత్సవానికి వెళ్లిన ప్రతిచోట కూడా అభిమానులను చూస్తూ ఉంటే తనకు ఆనందంగా అనిపిస్తుంది అని తెలిపింది హనీ రోజ్..

మరింత సమాచారం తెలుసుకోండి: