అయితే బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ అఖండ2 కూడా దసరా పండుగ కానుకగా విడుదల కానుందని తెలుస్తోంది. అదే సమయంలో చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉంది. అధికారికంగా ప్రకటించకపోయినా చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ కూడా దసరా పండుగ కానుకగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్నో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
మైసూర్ కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే పూర్తి కాగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ మొదలు కానుంది. చరణ్ ఈ మధ్య కాలంలో నిదానంగా సినిమాల్లో నటిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే బాలయ్య చరణ్ సినిమాలు ఒకే సమయంలో విడుదలై కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తే మాత్రం రేర్ రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు.
టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయని పెద్ద సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడం ఇండస్ట్రీకి ప్లస్ అవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ సినిమాల రేంజ్ అంతకంతకూ పెరిగి ఇతర భాషల్లో సైతం మరిన్ని విజయాలు సొంతం కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫుల్ రన్ కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరగాలని గ్లోబల్ స్టార్ అనే పేరును చరణ్ న్యాయం చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చరణ్ క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.