టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఆర్య సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి ఇప్పటికే ఎన్నో సినిమాలుకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే సుకుమార్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. దానితో ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాను రూపొందించాడు.

మూవీ తాజాగా డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత సుకుమార్ ఒక వేల వీలైతే పుష్ప పార్ట్ 3 లేదా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి అని మొదట్లో వార్తలు బలంగా వైరల్ అయ్యాయి. కానీ తాజాగా సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన మరో వార్త వైరల్ అవుతుంది. సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్టుగా పుష్ప పార్ట్ 3 కాకుండా రామ్ చరణ్ తో సినిమా కాకుండా మరో వినూత్న ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అదేమిటి అంటే సుకుమార్ ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం పుష్ప సినిమా తెరకెక్కించడం కోసం ఎర్ర చందనాన్ని ఎలా సేకరిస్తారు.

దాన్ని ఎక్కడ అమ్ముతారు. ఏ విధంగా అమ్ముతారు. వాటితో ఏం చేస్తారు. ఇలా అనేక విషయాలపై సుకుమార్ పరిశోధనలు చేశారట. అలాగే అనేక విషయాలను కూడా తెలుసుకున్నారట. కానీ సినిమాలో అవన్నీ చూపించడానికి స్కోప్ దొరకలేదట. దానితో నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో డాక్యుమెంటరీ పద్ధతిలో ఎర్ర చందనం సేకరణ , దాన్ని అమ్మడం , దానిని ఎలా ఉపయోగిస్తారు , ఏం చేస్తారు అనే దానిపై ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: