దీంతో మెగా హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నది .. అంతేకాకుండా పుష్ప 2 సినిమా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ఇప్పటికి 1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడప్పుడే పుష్ప 2 కలెక్షన్స్ ఆపడం కష్టమనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 సక్సెస్ మీట్ ను అల్లు అర్జున్, రష్మిక ,సుకుమార్, మైత్రి మూవీ ప్రొడక్షన్ వారు అమెరికాలో చాలా గ్రాండ్గా చేయబోతున్నారట.
డిసెంబర్ 21న గేమ్ ఛేంజర్ ఈవెంట్ ని అమెరికాలో చేయబోతున్నారు మొదటిసారి ఇలాంటి వేడుక జరగబోతూ ఉండడంతో యూఎస్ఏ లో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారట. ఇప్పటివరకు అంచనాలు అటు ఇటుగా ఉన్నప్పటికీ పాన్ ఇండియా సినిమా కావడం చేత రామ్ చరణ్ సినిమా పైన బజ్ ఏర్పడింది. అయితే ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా కుమార్ వెళ్లబోతున్నారని సమాచారం.. రంగస్థలంతో మంచి కాంబినేషన్ ఏర్పడిన రామ్ చరణ్, సుకుమార్ మరొకసారి రామ్ చరణ్ 17వ సినిమాని చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం.. గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.. మరి ఇందులో ఎంతవరకు నిజం ఒకవేళ వస్తే అన్నిటికీ చెక్ పెట్టినట్టే అని అభిమానులు తెలియజేస్తున్నారు.