నందమూరి నట‌సింహ బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. గత నాలుగైదు సంవత్సరాలుగా బాలయ్య తన వారసుడిని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసేందుకు ఎదురుచూస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ ఏడాది మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఖరారు అయింది. హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ డెబ్యు మూవీ ఫిక్స్ అయింది.అయితే అనూహ్యంగా ఆప్రాజెక్ట్ డైలమాలో పడిందనే ప్రచారం సాగుతంది. తప్పకుండా ఆ సినిమా ఉంటుంది? కానీ అది డెబ్యూ అవుతుందా? రెండవ సినిమా అవుతుందా? అన్నది ఆసక్తి కరంగా మారింది.
ఎందుకంటే? మోక్షజ్ఞతో బాలయ్య అంతకు మించి ప్లాన్ చేస్తున్నాడనే కొత్త ప్రచారం తెరపైకి వస్తుంది. 'కల్కి 2898' దర్శకుడు నాగ్ అశ్విన్ తో తనయుడిని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.


ఒకవేళ నాగ్ అశ్విన్ తో మొదటి సినిమా కాకపోతే రెండవ సినిమా అయ్యే అవకాశం ఉంటుందిట. అలా ప్రశాంత్ వర్మ-నాగ్ అశ్విన్ మధ్య చిన్న గేమ్ నడుస్తోంది.ఇదిలావుండగా యువ మేకర్ వెంకీ అట్లూరితో సినిమా చేసేలా ఒప్పందం చేసుకున్నట్లు వెలుగులోకి వస్తోంది. అలాగే 'ఆదిత్య 999'కి సీక్వెల్ ఉంటుందని కూడా చాలా కాలం క్రితం ప్రకటించారు.ఇక బాలయ్యలో కొత్త యాంగిల్ ని తట్టి లేపిన బోయపాటి శ్రీనుతో తనయుడికి ఓ ప్రాజెక్ట్ సెట్ చేసి పెట్టారు. మొత్తంగా మోక్షజ్ఞ కోసం బాలయ్య మొదటి ఐదు సినిమాలు ముందుగానే సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా ప్రస్తుతం మోక్షజ్ఞ డాన్సులు.. ఫైట్లలో శిక్షణ పొందుతున్నారు. ఇది ఇలా ఉంటే తొలి సినిమాతోనే మోక్షజ్ఞ అతిపెద్ద రిస్క్ చేస్తున్నాడు అన్న చర్చలు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ‌ వర్గాల సమాచారం ప్రకారం 100 కోట్ల కంటే ఎక్కువ బ‌డ్జెట్‌తోనే ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ట‌. అదే జ‌రిగితే మోక్ష‌జ్ఞ ముందు అతి పెద్ద టార్గెట్ ఉన్న‌ట్టు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: