గ్లోబల్ స్టార్ రామ్ చరణ్  షెడ్యూల్ ఫుల్ బిజీ. ఒక వైపు సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా ప్రచార కార్యక్రమాలు, మరో వైపు ఇటీవల కొత్తగా సెట్స్ మీదకు తీసుకోవలసిన సినిమా పనులు బిజీ బిజీగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలో రంగస్థలం తర్వాత సుకుమార్‌ డైరెక్షన్‌లో RC17 చిత్రానికి ఓకే చెప్పాడు రామ్‌చరణ్‌. ట్రిపుల్‌ ఆర్‌, గేమ్‌ఛేంజర్‌ చిత్రాలకు ఎక్కువ సమయం తీసుకున్న రామ్‌చరణ్‌ ఇక వేగంగా సినిమాలు తీయాలనే ఆలోచనతో వరుసగా కొత్త ప్రాజెక్టులకు కమిట్‌ అవుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలో బుచ్చిబాబు సెట్స్‌పై రాబోతుండగా, సుకుమార్‌ సినిమాకు కూడా అంతా రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు.రామ్‌చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ఛేంజర్ సినిమా ఫినిష్ చేశాడు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో నెక్ట్స్‌ మూవీలో నటించనున్నాడు. మరో వైపు స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ కూడాపుష్ప 2సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.ఇక పుష్ప' సిరీస్ తో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయింది. అతని బ్రాండ్ కూడా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది.ఇదిలావుండగా సుకుమార్ 'పుష్ప 2' తర్వాత రామ్ చరణ్ తో 'RC 17' మూవీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాడని అందరు అనుకున్నారు.

కానీ అంతకంటే ముందుగా నెట్ ఫ్లిక్స్ కోసం ఒక డాక్యుమెంటరీ చేయబోతున్నాడంట.అది కూడా 'పుష్ప' స్టోరీతోనే ఉండబోతోంది.పుష్ప 2' కోసం అందులో కొంత మాత్రమే ఉపయోగించారంట.
మిగిలిన ఇన్ఫర్మేషన్ తో నెట్ ఫ్లిక్స్ కోసం డాక్యుమెంటరీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత 'RC 17' మూవీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారని టాక్. ఈ క్రమంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు నమోదుకాగా వాట‌న్నిటినీ అందుకునేలా చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు సుకుమార్‌. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొద‌లు పెడ‌తారని తెలుస్తోంది. అలాగే 2025 చివరి మూడు నెలల్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారట. రామ్‌ చ‌ర‌ణ్‌, సుకుమార్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ కాంబినేష‌న్‌కి రాక్‌స్టార్‌, మ్యూజిక్ సెన్సేష‌న్ దేవిశ్రీ ప్ర‌సాద్ పేరు తోడ‌వ‌డం అభిమానుల్లో మ‌రింత ఉత్సాహాన్ని పెంచేస్తోంది. రంగ‌స్థ‌లం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ కాంబినేష‌న్ మ‌రోసారి చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ తో రెడీ అవుతోంది. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొడుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: